Mobile Popup Ad
Mobile Popup Ad

కాక్రోచ్ ఉద్యమంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనంగా మారింది. ఆన్ లైన్ లో నడుస్తున్న ఈ సెటైరికల్ ఉద్యమానికి అనూహ్య మద్దతు దక్కుతోంది. ప్రధానంగా జెన్ జీలు, బీజేపీ వ్యతిరేక శక్తులు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ సెటైరికల్ ఉద్యమం కొంతకాలం ఉండి చల్లారిపోతుందా? లేదంటే ఏదైనా సంచలనాలు నమోదు చేస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ కాక్రోచ్ పార్టీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy)  సంచలన వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ లాంటి ఉద్యమాలు, ఆన్ లైన్ వేదికలు పుట్టడానికి కారణం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీయే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ దేశానికి టెక్నాలజీ పరిచయం చేశారని.. అందుకే ఇటువంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయన్నారు.

బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారా?

కాక్రోచ్ పార్టీపై ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని.. అందుకే ఇటువంటి వేదికలు పుట్టుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా జగ్గారెడ్డి (Jagga Reddy) కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఏమిటీ కాక్రోచ్ పార్టీ ?

కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెటైరికల్ ఆన్‌లైన్ ఉద్యమంగా మొదలైంది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల అనంతరమే ఈ ఆన్ లైన్ వేదిక పుట్టుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  ఇది అధికారిక రాజకీయ పార్టీ కాదు, కేవలం సోషల్ మీడియా ఆధారిత వ్యంగ్య ఉద్యమం. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో భారీగా వైరల్ అవుతోంది. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ అవినీతి, పరీక్ష పేపర్ లీకేజీలు, యువత సమస్యలు వీటిని ప్రధానంగా కాక్రోచ్ పార్టీ ప్రశ్నిస్తోంది.

రాహుల్ గాంధీ పాత్రపై వివాదం

కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రశ్నల వల్ల వచ్చిన ఫలితంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించడం వల్లే ఈ ఉద్యమం రూపు దాల్చిందని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ బలహీనత ఫలితంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే సాగుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా యువత మధ్యలో చర్చను రేకెత్తిస్తోంది.

Read Also: డెవలపర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్‌లోకి గూగుల్ AI Studio

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>