గాజాలోని 70శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోండి : నెతన్యాహు

కలం, వెబ్ డెస్క్ : గాజాపై తమ దళాలు పట్టు సాధిస్తున్నాయని.. గాజా భూభాగంలో 70 శాతానికి పైగా నియంత్రణలోకి తీసుకోవాలని తమ దేశ సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Israel PM Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2025లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనలను ధిక్కరిస్తూ, గాజా స్ట్రిప్‌లో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదెశించినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం హమాస్ ను ఒత్తిడి పెడుతున్నామని.. గాజాలోని 60 శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు నేతన్యాహు వెల్లడించారు. 50 శాతం నుంచి 60 శాతానికి చేరుకున్నట్లు 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>