కాజీపేట్‌ రైల్వే యూనిట్‌.. కేంద్ర మంత్రి కీల‌క స‌మీక్ష‌

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణలోని కాజీపేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Unit) అభివృద్ధిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)గురువారం కీలక సమీక్ష నిర్వహించారు. రాబోయే ఐదేళ్లలో ఈ యూనిట్ ద్వారా 200 అత్యాధునిక ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేయాలని ఆయన లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణపై నిరంతర మద్దతు చూపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన, ఇంధన సామర్థ్యం కలిగిన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ కొత్త ఇంటర్‌సిటీ రైళ్లు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించ‌నున్నాయి. ఇవి సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోని నగరాలను అనుసంధానం చేస్తాయి. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో కూడిన సురక్షితమైన డిజైన్‌తో ఈ రైళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఈ రైళ్ల వల్ల ముఖ్యంగా స‌మీపంలోని పట్టణాలకు వెళ్లే విద్యార్థులకు, వైద్య సేవలు, ఉద్యోగ రీత్యా రాకపోకలు సాగించే సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి వివరించారు. ఈ రైళ్లు ఎక్కువ స్టాపులు కలిగి ఉండటం వల్ల చిన్న పట్టణాల ప్రజల రవాణా అవసరాలు సులభంగా తీరుతాయని ఆయన ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>