నేపాల్​ మాజీ ప్రధాని కేపీ. శర్మ ఓలీ అరెస్ట్

​కలం, వెబ్​ డెస్క్​ : నేపాల్​ (Nepal) నూతన ప్రధానిగా బాలెన్​ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆదేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే మాజీ ప్రధాని కేపీ. శర్మ ఓలీ (KP Sharma Oli) ని అరెస్ట్​ చేసింది. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేశ్​ లేఖక్​ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన జెన్​ జీ నిరసనలను కేపీ. శర్మ ఓలీ అణచివేశారన్న కారణాలతో నూతన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, నేపాల్​ ప్రధాన మంత్రిగా బాలెన్​ షా (Nepal PM Balendra Shah) ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూతన పీఎం అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్​ సమావేశంలోనే జెన్​ జీ నిరసనలపై ఏర్పాటు చేసిన కమిషన్​ నివేదికను పరిశీలించారు. అనంతరం కమిషన్​ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ప్రధాని కేపీ. శర్మ అరెస్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం తెల్లవారు జామున ముందుగా మాజీ హోం మంత్రి రమేశ్​ లేఖన్​ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది సమయానికే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>