కలం, వెబ్ డెస్క్ : ఎండాకాలం తీవ్రత మొదలైంది. మొన్నటి దాకా కాస్త చల్లని వాతావరణం కనిపించింది. కానీ రేపటి నుంచి సమ్మర్ ప్రభావం పెరగబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరీ ముఖ్యంగా రేపు ఏపీలో తీవ్రమైన వడగాల్పులు (Heatwave) ఉంటాయని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా నమోదు అవుతాయని.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని సూచించింది.

