కలం, వెబ్ డెస్క్ : కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల (Congress Star Campaigners) జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల బరిలో పార్టీని విజయపథంలో నడిపించేందుకు మొత్తం 40 మంది నేతలను కేరళ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కీలక బాధ్యతలు అప్పగించారు. అటు కేరళ ఎన్నికలతో పాటు గోవాలోని పోండా నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ ప్రకటించింది.
తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా గోవాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ జాబితాలో (Congress Star Campaigners) కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ చోటు దక్కించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే లక్ష్యంతో అధిష్టానం తన వ్యూహాలకు పదును పెడుతోంది.
Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ
Follow Us On: Instagram

