కలం, వెబ్ డెస్క్: భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ (Nepal) ప్రకటించింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నట్లు తమ పరీక్షల్లో తేలినందునే.. ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేగాకుండా భారత్, నేపాల్ సరిహద్దుల్లో మామిడి దిగుమతి అయ్యే క్రమంలో ఎలాంటి తనిఖీలు కూడా జరగడం లేదని కూడా పేర్కొంది. తద్వారా నాణ్యతా లోపాలు తలెత్తుతున్నట్లు వివరించింది. నేపాల్ నిర్ణయంతో భారత్ మామిడి (Indian Mangoes) ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్ సైతం దిగుమతులు నిషేధించిన నేపథ్యంలో.. నేపాల్ చర్య మామిడి రైతులకు శరాఘాతంగా మారనుంది. అయితే, నేపాల్ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లకు ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడం గమనార్హం.
Read Also: ‘ఝల్‌మురి’ ఆరగించిన మోదీ.. వడ్డించిన సీఎం
Follow Us On: X(Twitter)

