కలం, వెబ్ డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలో పలువురు టీడీపీ (TDP) నేతలు అశ్లీల నృత్యాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ నేతలు పార్టీ పదవుల్లో ఉండటంతో పాటు, ఆలయ కమిటీ చైర్మన్లుగా ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దొరికిందే ఛాన్స్ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ వీడియోలను తెగ వైరల్ చేసేశారు. తాజాగా ఆ వీడియోలపై సదరు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు స్పందించారు. ఆ వీడియోలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్ చేశారని, తమపై దుష్ప్రచారం చేసేందుకే ఇలా చేస్తున్నారని వెల్లడించారు.
బీసీ వర్గీయులపై బురద చల్లేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆలయ చైర్మన్‌గా కోదండరామ స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించడమే నేరమా అని ప్రశ్నించారు. బీసీల ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు మార్ఫింగ్ వీడియోలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీ నాయకులు, బీసీ నేతలు ఎప్పుడూ ఇలా చేయరని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేసి, భుజంతట్టి ప్రోత్సహిస్తున్నారని, తాము ఎలాంటి తప్పుడు పనులు చేయమని వెల్లడించారు.
Read Also: ‘మత్తుబాటు వదలండి.. మైదానాల బాట పట్టండి’ అంటూ సీఎం రేవంత్ పిలుపు
Follow Us On: Facebook

