కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది మండలం జులకల్‌లో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తల్లి మమత(28).. కుమారుడు మణికంఠ (5), కుమార్తె ప్రళయ (4) సంగారెడ్డి జిల్లా కంది మండలం జులకల్‌లో మృతదేహాలను ఆసుపత్రికి తరించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. భర్త చనిపోయినప్పటి నుంచి మనస్తాపానికి గురైన మమత పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ఈ అలవాట్లే ఆఫీసులో మీ ఇమేజ్‌ను తగ్గిస్తున్నాయ్..!
Follow Us On: X(Twitter)

