కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం మలకనగిరి జిల్లా నుంచి వరంగల్ వైపు అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని రాయపర్తి పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని బిక్రమ్ మండేల్, గౌతమ్ మండేల్, బ్రిప్రోజిత్ మండేల్ గుర్తించారు.
వీరు కారులో గంజాయి తరలిస్తుండగా ఎస్సై ముత్యం రాజేందర్, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారు, 3 మొబైల్ ఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow Us On: X(Twitter)

