కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు మేయర్ (Nellore Mayor) పదవికి పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. ఈ నెల 18న జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశం నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీలో చేరడం.. మళ్లీ వారిలో ఒకరు టీడీపీకి గూటికి చేరుకోవడం ఇలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. తనకు మద్దతు ఇస్తున్నవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మంత్రి నారాయణ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
‘గిరిజన బిడ్డను ఎదుర్కొనే శక్తి లేకనే నా మీద కుట్రలు చేశారు. నాకు మద్దతుగా నిలుస్తున్న కార్పొరేటర్లను భయపెట్టడం, కేసులు పెట్టడం బాధాకరం. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా వారి ఇళ్లకు వెళ్లి వేధింపులకు గురిచేశారు’ అని పొట్లూరి స్రవంతి (Nellore Mayor) ఆరోపించారు. తనకు మేయర్ పదవి ఇచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కష్టకాలంలో అండగా నిలిచిన గిరిజన నాయకులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
Read Also: రోజాకు చక్రపాణి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: X(Twitter)


