epaper
Friday, January 16, 2026
spot_img
epaper

12న వస్తున్న చిరు.. రాజాసాబ్ ఏం చేస్తాడో..?

కలం, వెబ్ డెస్క్మె : గాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. అనిల్ సినిమాలు సంక్రాంతి రావడం కామనే. కాకపోతే ఈ సారి ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా గట్టి పోటీకి రెడీ అయింది. ఈ మూవీ జనవరి 9న రాబోతోంది. అంటే శంకర వర ప్రసాద్ మూవీ కంటే మూడు రోజుల ముందే వస్తుంది. సంక్రాంతి సీజన్ లో ఈ రెండు సినిమాల మధ్యనే గట్టి పోటీ ఉంది. కాబట్టి రాజాసాబ్ ముందు వస్తే ఆ సినిమా రిజల్ట్ మన శంకర వర ప్రసాద్ గారుమూవీపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు మూవీ లవర్స్. ఒకవేళ ది రాజాసాబ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. మూడు రోజుల దాకా వేరే పెద్ద సినిమా ఉండదు కాబట్టి ఇది రాజాసాబ్ కు కలిసొచ్చే అంశం.

అప్పుడు ప్రేక్షకుల్లో రాజాసాబ్ మీదనే హైప్ ఉంటుంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కామెడీ యాంగిల్ లోనే వస్తున్నాయి కాబట్టి.. యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదంటున్నారు ట్రేడ్ నిపుణులు. అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్ లో మంచి కలెక్షన్లు వస్తుంటాయి. ఈ సారి కూడా ప్రమోషన్లు బాగానే చేస్తోంది టీమ్. మరి ఈ సారి ఎలాంటి పోటీ ఉంటుందో చూద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>