కలం, వెబ్ డెస్క్: మెక్సికో దేశం భారత్ మీద 50 శాతం సుంకాలు(Mexico Tariff) విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా భారత్ స్పందించింది. మెక్సికో సుంకాలపై తగిన చర్యలు తీసుకుంటామని.. భారత్ కు మేలు జరిగేవిధంగా చర్చలు జరుపుతామని తెలిపింది. భారత్ ఎగుమతి దారుల హక్కుల కోసం కట్టుబడి ఉన్నామని.. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకునే హక్కు భారత్ కు ఉందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ లోనే సెనెట్ లో మెక్సికో ఈ ప్రతిపాదనలు చేస్తే.. అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయాన్ని పరిశీలించాలంటూ కోరినట్టు ఇండియా తెలిపింది.
భారత్ తో పాటు చైనా, సౌత్ కొరియా, థాయ్ లాండ్, ఇండోనేషియా సహా ఇంకొన్ని ఆసియా దేశాలపై ఈ సుంకాలు(Mexico Tariff) విధిస్తామని మెక్సికో ప్రకటించింది. ఇప్పటికే అమెరికా ఇండియా మీద భారీగా సుంకాలు విధిస్తుండగా.. ఇప్పుడు మెక్సికో కూడా అదే బాటలో పయనిస్తోంది.
Read Also: సమ్మిట్ సమిష్టి నిర్ణయం కాదా?
Follow Us On: Instagram


