Mobile Popup Ad
Mobile Popup Ad

‘ప్రభుత్వం మారింది.. అందుకే బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతున్నాం’

క‌లం, వెబ్‌డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో రాజకీయ మార్పుల తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశీ వలసదారులు (Bangladesh Migrants)గా చెప్పుకుంటున్న పలువురు ఇప్పుడు సరిహద్దు దాటేందుకు సిద్ధమవుతున్నారు. తమ పరిస్థితికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, అలాగే రాష్ట్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం రావడం కారణమని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ బంగ్లాదేశీ యువకుడు మాట్లాడుతూ.. బ్రోకర్లు తమను పశ్చిమ బెంగాల్‌కు తీసుకొచ్చారని వెల్లడించాడు. తమ వద్ద ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు కూడా ఉన్నాయని తెలిపాడు. తాము బంగ్లాదేశ్ పౌరులమేనని కూడా అంగీకరించాడు.

మరికొందరు మాట్లాడుతూ.. తమకు టీఎంసీ ప్రభుత్వం తీసుకొచ్చిందా అన్న విషయం తెలియదని చెప్పారు. ఇంకొందరు తమ వద్ద ఎలాంటి పౌరసత్వ పత్రాలు లేవని, ప్రస్తుతం పరిస్థితులు మారడంతో తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తున్నామని వెల్లడించారు. మరో వలసదారు మాట్లాడుతూ, తాము బంగ్లాదేశ్ పౌరులమని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పెరిగాయని తెలిపాడు. తమ వద్ద ఉన్న ఓటరు కార్డులను ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం తొలగించిందని, అందుకే స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

Read Also: యూసీసీ బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>