Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ పాలన చూసి మేఘాలే మొఖం చాటేస్తున్నాయి: జీవన్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటికీ కొంతమందికి అసలు మాఫీనే కాలేదని మండిపడ్డారు. “ఏ రకం వరికైనా బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు సన్నాలకే బోనస్ అంటున్నారు. బోనస్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే” అని నిలదీశారు.

ఇక ప్రభుత్వం ఎందుకు?

కేసీఆర్ హయాంలో మొత్తం ధాన్యం సేకరించామని, ఇప్పుడు కేంద్రం అనుమతించిన మేరకే కొంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎందుకని ఆయన ప్రశ్నించారు. క్వింటాల్‌కు 3-5 కిలోల కోత, ధర్మకాంటా-ట్రక్‌షీట్ వ్యత్యాసం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని యూరియా కొనుగోలు యాప్‌ను తెలంగాణలో తెచ్చి రైతులను గోస పెడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం సూచించిన 7 రకాల ధాన్యానికి ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వస్తే, మిగిలిన రకాలకు 30 క్వింటాళ్లు వస్తుందన్నారు. దీంతో రైతుకు ఎకరాకు 24,700 రూపాయలు నష్టం తప్పదని లెక్కలు చెప్పారు.

కేసీఆర్ పాలనలో ఆంక్షలు లేకుండా రుణమాఫీ, దేశంలో ఎక్కడా లేని రైతు బీమా అమలు చేశామని గుర్తు చేశారు. కానీ రేవంత్ సర్కారు రైతు భరోసా ఎగ్గొడుతోందని, 7600 మంది రైతులు బీమా కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పంటల బీమా పథకమే అమలు చేయడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు అతి, గతి లేదని, రెండేళ్లుగా కాళేశ్వరం పిల్లర్ల మరమ్మతు కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

వరంగల్ డిక్లరేషన్ భగవద్గీతలా అమలు చేయాలి

కాంగ్రెస్ వరంగల్ లో డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను భగవద్గీతగా భావించి అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని జీవన్ రెడ్డి అన్నారు. పంటలు కొనుగోలు చేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతు బంధు, భీమకు పెద్దపిటా వేశారాని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాత్రం పదవులకోసమే పని చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ భీమా కింద 20 వేల కోట్లు ఎగొట్టిందని రమణ ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీని నీలాదిస్తామని, కేసులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతామణి,, రైతుల వెన్నంటి ఉంటామన్నారు.

కేసీఆర్ హయాంలో రైతు రాజు

మాజీ జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ. కేసీఆర్ హయాంలో రైతు రాజులగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎల్నీనో హెచ్చరికలు వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆమే ఆరోపించారు. విత్తనాలు, ఎకరాకు, 4 బస్థాల యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని వసంత విమర్శించారు. కేసీఆర్ 24 గంటల కరెంట్, కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు డిస్కమ్ పేరుతో కరెంట్ కు తూట్లు పొడుస్తున్నారని వసంత ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి,తిరుపతి,నేహాల్, భారీ, రాధాకిషన్, మాసర్తి రమేష్,తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>