కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) గతంలో గెలిచిన స్థానాల్లో సగాన్ని కూడా ఈసారి గెలవలేకపోయింది. కేవలం 35 స్థానాలతోనే ఈసారి సరిపెట్టుకున్నది. క్రితంసారితో పోలిస్తే దాదాపు 58 చోట్ల ఓటమి తప్పలేదు. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంతోని యూడీఎఫ్ (UDF) మాత్రం గతంలో 41 స్థానాల్లోనే గెలిస్తే ఈసారి అదనంగా 50 గెల్చుకుని 90 సీట్లు దాటేసింది. కాంగ్రెస్ నేతలు ‘నీ పో మానె’ (Nee Po Mone) అనే సినిమా డైలాగ్‌ను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడారు.
అది వర్కవుట్ అయింది. ‘నువ్వు వెళ్లిపోయే టైమ్ వచ్చేసింది విజయన్ (Pinarayi Vijayan)..’ అనే అర్థంలో ఈ డైలాగ్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేమమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో వాడారు. మోహన్‌లాల్ నటించిన 2000 నాటి ‘నరసింహమ్’ చిత్రంలో విలన్‌ను ఉద్దేశించి వాడిన ఈ డైలాగ్ కేరళంలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు విజయన్ ఓటమితో ఆ డైలాగ్ జనంలో బాగా పని చేసినట్లయింది.
Read Also: కేరళలో హామీలు నెరవేర్చేందుకు కష్టపడతాం: ప్రియాంకా గాంధీ
Follow Us On: Instagram

