Mobile Popup Ad
Mobile Popup Ad

కేర‌ళ‌లో హామీలు నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ‌తాం: ప్రియాంకా గాంధీ

క‌లం వెబ్ డెస్క్: కేర‌ళ (Kerala) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూడీఎఫ్ (UDF) సాధించిన ఘ‌న‌ విజ‌యంపై కాంగ్రెస్ నాయ‌కురాలు, వ‌య‌నాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. కేర‌ళ ప్ర‌జ‌లు త‌మ‌పై ఉంచిన న‌మ్మ‌కానికి ఎక్స్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ విజ‌యం రాబోయే ఐదేళ్ల‌లో రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డేందుకు త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తుంద‌ని చెప్పారు. కేర‌ళ‌లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ‌తామ‌ని ప్రియాంకా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.

ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌య‌నాడ్‌పై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు యూడీఎఫ్‌కు తిరుగులేని మెజారిటీని క‌ట్ట‌బెట్టార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో అన్నింటినీ యూడీఎఫ్ కైవ‌సం చేసుకుంద‌ని వెల్ల‌డించారు. వ‌య‌నాడ్ అభివృద్ధి కోసం ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మొత్తంగా 8 మంది ప్ర‌జా ప్ర‌తినిధులు క‌లిసి ప‌ని చేస్తార‌ని హామీ ఇచ్చారు. ఈ విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించిన పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఆమె హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Read Also: కేరళంలో యూడీఎఫ్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>