కలం వెబ్ డెస్క్: యాభై ఏండ్ల తర్వాత తమిళనాడు (Tamil Nadu) ఓటర్లు మార్పుకే పట్టం గట్టారు. ద్రవిడ పార్టీల లెగసీకి బ్రేక్ వేశారు. మొట్టమొదటిసారి ద్రవిడ పార్టీలను కాదని కొత్తగా వచ్చిన విజయ్‌ను అందలమెక్కించారు. నేతలే కేంద్రంగా ఉండే పాలిటిక్స్‌కు స్వస్తి పలిగారు. సంక్షేమ పథకాలకంటే ఆకాంక్షలనే విశ్వసించారు. రాష్ట్రంలోని రాజకీయ శూన్యతకు ప్రత్యామ్నాయం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అని బలంగా నమ్మారు. ఫస్ట్ టైమ్ ఓటర్లు, యువత, మహిళలు కొత్తదనాన్ని కోరుకున్నారు. ద్రవిడ పార్టీల సెంటిమెంట్‌కు భిన్నంగా ఓపెన్ మైండ్‌సెట్‌తో ఆలోచించారు. డీఎంకే పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు. వారసత్వ రాజకీయాలను తిరస్కరించారు.
జెన్‌జీ, యూత్ ఆల్టర్నేట్ థింకింగ్ :
దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా తమిళ (Tamil Nadu) ఓటర్లు ద్రవిడ పార్టీలకే పట్టం కట్టారు. ఆ సిద్ధాంతంతో కొనసాగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునేలా ఆలోచించారు. నాన్-ద్రవిడ పార్టీలను తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ను ఓటర్లు పక్కన పెట్టారు. ద్రవిడ సిద్ధాంతం జోలికి వెళ్ళలేదు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీని ఆదరించారు. ఫస్ట్ టైమ్ ఓటర్లు, 35 ఏండ్ల వయసులోపు ఉన్న యువత డిఫరెంట్‌గా ఆలోచించారు. ద్రవిడ సిద్ధాంతం, సెంటిమెంట్, సంక్షేమం.. వీటిని పట్టించుకోలేదు. మార్పును స్వాగతించారు. రెండు ద్రవిడ పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలనే సంప్రదాయానికి బ్రేకులు వేశారు. యూత్ ఆలోచన సంప్రదాయ పార్టీలను తిరస్కరించింది.
Read Also: సీఎం రేవంత్ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ విజయం: ఆది శ్రీనివాస్
Follow Us On: Sharechat

