కలం, నిర్మల్ : వర్షాకాలం ఆకస్మిక వరదలు సంభవిస్తే ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ.. వర్షాకాలం భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించి జిల్లా ప్రజలకు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వారి సహాయం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం పనిచేయాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తానికి అవసరమైన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వర్షాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్ఓ రమేష్ రాథోడ్, ఆర్డిఓ దేవిదాస్ , ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జిడి ముఖేష్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
Read Also: అటవీ అడ్డంకులు.. అంధకారంలో ఆదివాసీ గూడెం!
Follow Us On: Instagram

