కలం, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ (Mohammad Musthafa Shaik)ను గుజరాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కిడ్నాప్ కేసులో ముస్తఫాను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి ఆయనను నూజివీడుకు తరలిస్తున్నారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్ కేసు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ముస్తఫా, ఆయన కుమారుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు అభితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం మస్తఫాను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

