కలం, సినిమా : అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ మూవీని సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. యువత కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు అతిథులుగా విచ్చేశారు. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మీరు మౌత్ టాక్ తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన మూడు విజయాలు.. నాలో ఎంతో ఎనర్జీని నింపాయి. ఆ ఎనర్జీకి రెట్టింపు వినోదాన్ని మీకు అందించాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది. టీంలో ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో అనగనగా ఒక రాజుకి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు సినిమా వస్తుందని నవీన్ అన్నారు.

Read Also: 200 కోట్ల మార్క్ దాటేసిన ప్రభాస్ “ది రాజాసాబ్”
Follow Us On: X(Twitter)


