కలం, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భోళా శంకర్ మూవీతో డిజాస్టర్ చూసిన తర్వాత ఈసారి గురి తప్పేదేలే అన్నట్టుగా మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వచ్చారు ఈ మూవీ రిలీజ్ కి ముందు టాక్ ఉన్నట్టుగానే బ్లాక్ బస్టర్ సాధించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతుంది. ఈ ఇయర్ లో మెగా హీరో చిరంజీవి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. మరి.. ఆ ఇద్దరూ ఈ సక్సెస్ ను కంటిన్యూ చేస్తారా..? అనేదే హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరంటారా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటించింది. పెద్ది ఫస్ట్ సింగి ల్ తో యూట్యూబ్ ని షేక్ చేశాడు. దీంతో పెద్ది మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ భారీ సినిమాను మార్చి 27న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరు మూవీ సక్సెస్ ను చరణ్ కంటిన్యూ చేస్తారని మెగా ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇక చరణ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ రానున్నాడు. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ మూవీ పై మరింతగా క్యూరియాసిటీని పెంచేసింది. సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాతో పవన్ కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి.. చిరు (Chiranjeevi) సక్సెస్ ను చరణ్, పవన్ కంటిన్యూ చేసి బ్లాక్ బస్టర్స్ సాధిస్తారేమో చూడాలి.
Read Also: ‘జన నాయగన్’ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడే: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp


