Mobile Popup Ad
Mobile Popup Ad

పెదాలు పొడిబారుతున్నాయా? ఈ సహజ చిట్కాలతో మృదువుగా మార్చుకోండి

కలం, వెబ్‌డెస్క్: మీ ముఖం ఎంత తెల్లగా ఉన్నా.. పెదాలు పొడిబారినట్లు (Dry Lips) ఉంటే అందం మొత్తం మసకబారిపోతుంది. అసలు పెదాలు ఎందుకు పొడిబారుతాయి అంటే సహజమైన రక్షణ పొర, తేమ లేకపోవడం వల్ల అవి త్వరగా పొడిబారుతాయట. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు పెదవుల్లోని తేమ ఆవిరైపోతుంది.

దీనివల్ల కూడా పెదవులు పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ.. వంటివి తరచుగా వాడుతుంటారు కొందరు. అయితే వీటితో పాటు కొన్ని సహజ చిట్కాలు (Lip Care) పాటించడం ద్వారా పెదాలు పొడిబారకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

కొబ్బరి నూనెతో పగుళ్లకు చెక్

ఇందులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, సహజ తేమ ఉంటాయి. రోజుకు 2-3 సార్లు పెదవులపై రాస్తే పగుళ్లు త్వరగా తగ్గుతాయని సూచిస్తున్నారు నిపుణులు.

గులాబీ రేకులతో

గులాబీ రేకులతో కూడా పెదవుల పగుళ్లను దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని గులాబీ రేకులు తీసుకొని పచ్చిపాలలో కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ గులాబీ మిశ్రమాన్ని రోజుకి మూడు నుంచి నాలుగుసార్లు పెదాలపై అప్లై చేసుకుంటే వాటి మృదుత్వాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

సహజ మాయిశ్చరైజర్.. పాలమీగడ

పగిలిన పెదాల్ని తిరిగి మృదువుగా మార్చడంలో పాలమీగడ బాగా సహకరిస్తుందట. పాలమీగడలో ఉండే కొవ్వు పదార్థాలు పెదాలకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేసి పెదవులను మృదువుగా మారుస్తాయని చెబుతున్నారు నిపుణులు. దీని కోసం పాలమీగడను పెదవులకు రాసి కాసేపు ఆరనివ్వాలట. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా పెదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చట.

అంతే కాకుండా గ్లిజరిన్, రోజ్ వాటర్ సమపాళ్లలో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని నిద్రపోయే ముందు పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే.. చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>