Mobile Popup Ad
Mobile Popup Ad

ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తల్లి.. పోలీసుల గాలింపు

కలం, వెబ్ డెస్క్: కామారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో లయ (31) అనే మహిళ తన ముగ్గురు పిల్లలు శివ (13), బిందు (16), దివిజ (8)లతో కలిసి కనిపించకుండా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు మారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే సదరు మహిళ మనస్తాపానికి గురై తన పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదృశ్యమైన నలుగురి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>