కరీంనగర్ డీడీతో మాల మహానాడు నేతల భేటీ

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మిని జాతీయ మాల మహానాడు (Mala Mahanadu) జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సామాజిక సంక్షేమ శాఖకు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డీడీని కలిసిన వారిలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడ కనకయ్య, రాష్ట్ర నాయకులు దామెర సత్యం, పార్లమెంట్ ఇన్‌చార్జ్ బోలుమాల సదానందం, నాయకులు పాఠకుల భూమయ్య, మద్దెల రాజేందర్, చిలుక రామస్వామి, చాతల్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>