కలం మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) నియోజకవర్గం తరుచు ప్రొటొకాల్ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించలంటే అధికారులకు, పోలిసులుకు కత్తి మీద సాములా తయారైంది పరిస్ధితి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల బలప్రదర్శనకు ప్రభుత్వ కార్యక్రమాలే వేదికలుగా మారుతున్నాయి. అభివృద్ధి కోసం పోటి పడవల్సింది పోయి అధిపత్యం కోసం ప్రయాసపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 నుండి నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వరుసగా మూడు సార్లు గెలిచింది. నర్సాపూర్ ఎమ్మెల్యేగా 2023లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై విజయం సాధించారు. నర్సాపూర్ లో బీఆర్ఎస్ గెలిచినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దింతో నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో బిఅర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం రాజుకుంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బిఅర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికి, ఇతర నియోజకవర్గాల్లోనూ లేనివిధంగా.. నర్సాపూర్ మాత్రం ప్రోటోకాల్ సమస్య రాజకీయవేడిని రాజేస్తుంది.
ప్రొటొకాల్ పేరుతో బలప్రదర్శన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే సునీత రెడ్డి (MLA Sunitha Reddy), కాంగ్రెస్ నుండి పోటి చేసి ఓడిపోయిన ఇంచార్జి అవుల రాజిరెడ్డి మధ్య ప్రభుత్వ కార్యక్రమల వేదికగా అధిపత్య పోరు నడుస్తూ వస్తుంది. మంత్రుల పర్యటన సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఎమ్మెల్యే సునీతా వ్యతిరేకిస్తు వస్తున్నారు. ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి అధికారిక కార్యక్రమాల్లో అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. నర్సాపూర్ (Narsapur) నియోజకవర్గంలో కార్యక్రమం ఏదైనా ప్రోటోకాల్ సమస్యతో సభ రసాభసాగా మారడం రివాజుగా మారింది. ఎమ్మెల్యే ఉన్న తమకు ప్రొటొకాల్ పాటించడం సరిగా లేదంటూ సునీతా లక్ష్మారెడ్డి స్పీకర్ ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు.
తనకు తేలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తురని, సమావేశాలు జరిగే క్రమంలో తనను పట్టించుకోవడం లేదని అమె చాలా సార్లు అవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇంచార్జ్ మంత్రి వివేక్ నర్సాపూర్ (Narsapur) పర్యటనలో ప్రోటోకాల్ వివాదంతో మొదలై రాజకీయ రచ్చకు దారి తీసింది. నర్సాపూర్ లో నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలోనూ ప్రోటోకాల్ పాటించడంలేదని సభ వేదిక నుండే సునీతా రెడ్డి మాట్లడడారు. దీనికి మంత్రి వివేక్ (Minister Vivek) సమాధానం ఇస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మీరు ప్రతిపక్ష పార్టీని ఇదే విధంగా చేశారని అనడంతో మొదలైన గొడవ చివరికి రాజకీయ విమర్శల వరకు వెళ్లి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగే పరిస్ధితి ఏర్పడింది. మెదక్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నచ్చజేప్పేందుకు యత్నించినా గొడవ సర్ధుమనగాలేదు.
రాజకీయాల కోసం రచ్చ
నర్సాపూర్ (Narsapur) నియోజకవర్గంలో నిజానికి విచిత్ర పరిస్ధితి. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నేత మదన్ రెడ్డి చేతిలో రెండుసార్లు ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ గా భాద్యతలో తీసుకున్నది. 2023 ఎన్నికల్లో బలమైన లీడర్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy)కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చారు. మదన్ రెడ్డి సంపూర్ణ మద్దతుతో ఊరు ఊరు తిరగడంతో ఎమ్మెల్యే గా సునీతా రెడ్డి గెలిచారు. అయితే తను ఎమ్మెల్యే గెలిచిన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సునీతా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలొకి రావడంతో నర్సాపూర్ లో పెద్దదిక్కులేక బలహీనం అవుతుందని అంచనా వేశారు. కానీ సునీతా రెడ్డికి షాక్ ఇచ్చేలా అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి పొటిచేసిన అడ్వకేట్ అవుల రాజిరెడ్డి గట్టిపోటి ఇచ్చి ఓడిపోయారు. తర్వాత అవుల రాజిరెడ్డి ఇంచార్జిగా పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలు సాధించడంతో పాటు ఏకంగా నర్సాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోని, రాజకీయంగా బలం పుంజుకొవడంతో ఎమ్మెల్యే సునీతా రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది పడింది.
ప్రొటొకాల్ అంశం అనేది కేవలం బయటకు మాత్రమే చెబుతున్న సాకు అని, తానూ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత వీక్ గా కనిపించిన కాంగ్రెస్ పార్టీ.. ఆవుల రాజిరెడ్డి (Aavula Rajireddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలపడటం కూడా ఆమె జీర్ణించుకలేకపోతుందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సహజంగానే అధికార పార్టీ నాయకుల మాటలనే అధికారులు వినే పరిస్ధితి ఉంటుంది. దింతో నర్సాపూర్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటే అధికారులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి చెప్పిన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. అంతేకాకుండా వివిధ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ నిధుల ఖర్చు, అభివృద్ధి ప్రణాళికలో రాజిరెడ్డి హవానే నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులే బాహటంగా చెబుతున్నారు. దింతో భవిష్యత్తు రాజకీయాల్లో తమ ప్రభావం ఉండేలా అధిపత్యం కొసం ఎమ్మేల్యే సునీతా రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి రాజిరెడ్డి మధ్య వార్ నడుస్తుంది.
అధికారులకు తలనొప్పి
నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పథకాల లబ్ధదారుల ఎంపిక, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలంటే అధికారులు హడలిపోతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే మరొవైపు.. మరొవైపు అధికార పార్టీ ఇంచార్జి ఎవరి మాట వినాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏ కార్యక్రమంలో ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య అధిపత్య పోరు వారికి తలనొప్పిగా మారుతున్నాయి. అధికారులు సర్ధిచెప్పి ప్రయత్నం చేస్తున్నా ఎవరు వెనక్కి తగ్గకపొవడంతో ఏ కార్యక్రమం చేసినా చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. నర్సాపూర్ అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య జరుగుతున్న పోరు వివిధ శాఖల అధికారులకు మాత్రం లేనిపోని తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. రోజు రోజుకు రాజకీయ రచ్చ పెరగడం తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చే ప్రజలు మాత్రం తమ సమస్యలను వినకుండా.. రాజకీయ పార్టీల గొడవలతోనే సరిపోతుందని చెబుతున్నారు. నర్సాపూర్ లోని రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో మంత్రి కార్యక్రమం అయితే భారీ ఎత్తున పోలిసుల బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు.
Read Also: తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. అన్నామలై ఏం అన్నారంటే!
Follow Us On: Instagram

