కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల ఫలితాలపై బీజేపీ కీలక నేత అన్నామలై (Annamalai) స్పందించారు. ‘ఎన్నికల తీర్పు ప్రకటించిన ఓటర్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ‘ఓట్లు కొనుగోలు చేయొద్దు, వారసత్వ రాజకీయాలు వద్దు’ అనే అంశంలో ఏకతాటిపై నిల్చున్న నా ప్రజలను చూస్తే గర్వంగా ఉంది. రాజకీయాల్లో తరం మార్పు స్పష్టంగా కనిపించింది. ఇదొక శుభపరిణామంగా భావించాలి. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే పార్టీ, విజయ్‌కు శుభాకాంక్షలు. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఉండి వీరోచితంగా పోరాడిన ఎన్డీయే అభ్యర్థుల్లో గెలుపొందినవారికి శుభాకాంక్షలు.
ఎవరైతే ఓడిపోయారో.. మరింత పట్టుదలతో పోరాడుతూనే ఉండాలి. డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్టీకే అధినేత సీమన్ ఓటమి విచారకరం. చివరగా.. బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మనకు మంచి రోజులు కచ్చితంగా వస్తాయి’ అని పేర్కొన్నారు.
Read Also: సీఎం రేవంత్ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ విజయం: ఆది శ్రీనివాస్
Follow Us On : WhatsApp

