కలం, వెబ్ డెస్క్ : వినీషియస్ జూనియర్ (Vinicius Junior) మరోసారి తన అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. ఎస్పానియోల్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి రియల్ మాడ్రిడ్ (Real Madrid) జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనపై రియల్ మాడ్రిడ్ మాజీ స్టార్ కరీమ్ బెంజెమా (Karim Benzema) ప్రశంసల వర్షం కురిపించాడు. వినీషియస్ పోస్ట్‌కు స్పందిస్తూ అతడే జట్టులో ‘నంబర్ వన్’ ప్లేయర్ అని కితాబిచ్చాడు. మ్యాచ్‌లో మొదటి అర్ధభాగం సమంగా సాగినా, రెండో అర్ధభాగంలో వినీషియస్ చెలరేగిపోయాడు.
55వ నిమిషంలో మొదటి గోల్ చేసి, కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే రెండో గోల్ కూడా సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ సీజన్‌లో ఇది అతని 15వ గోల్‌గా నమోదైంది. మరోవైపు కిలియన్ ఎంబాప్పే గాయంతో దూరంగా ఉండటంతో, కోచ్ అల్వారో అర్బెలోవా జట్టును ముందుండి నడిపించాలని వినీషియస్‌కు (Vinicius Junior) బాధ్యత అప్పగించారు. వినీషియస్ ప్రదర్శనతో రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టికలో తన స్థితిని బలోపేతం చేసుకుంది. రాబోయే కీలక మ్యాచ్‌ల ముందు ఈ విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బార్సిలోనాతో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు ముందు ఈ గెలుపు జట్టుకు పెద్ద బూస్ట్‌గా మారిందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
Read Also: ఓటమిపై స్పందించిన స్టాలిన్..!
Follow Us On: Sharechat

