ప్రేమ పేరుతో ప్రభుత్వ అధికారి మోసం..!

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో (Narayankhed) ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేసిన ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ అధికారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం.. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మోహన్ అనే వ్యక్తి నర్సింగ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో 19 ఏళ్ల యువతి ANM ట్రైనీగా పనిచేస్తోంది.

ఈ క్రమంలో సదరు యువతిపై కన్నేసిన మోహన్, ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సదరు యువతిని లోబరుచుకున్నాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో, మోహన్ తనను మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>