దేవుడిపై ఒట్టేసి మాట తప్పారు: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రుణమాఫీ విషయంలో దేవుడిపై ఒట్టేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్దిపేటలో జరిగిన రైతుల మహా పాదయాత్రలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి స్పందించకపోతే.. ఊరూరా రైతులు దండులా కదులుతారని పేర్కొన్నారు.

ఎరువులకు కూడా ఇబ్బందే..

పాలకుడు పాపాలు చేస్తే రాష్ట్రానికి అరిష్టమని.. సీఎం రేవంత్ రెడ్డి అదే చేశాడని హరీశ్ రావు మండిపడ్డారు. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ, కొమురవెల్లి, ఏడుపాయల అమ్మవారి పేర్ల మీద ఒట్లు పెట్టాడని విమర్శించారు. రేవంత్ మాట తప్పడం వలనే.. రాష్ట్రానికి ఈ దుస్థితి తలెత్తిందన్నారు.

కేసీఆర్ హయాంలో ఎరువులకే ఇబ్బందే లేదని.. ఇప్పుడు మాత్రం బస్తా కూడా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. యాప్ పెట్టి మభ్యపెడుతున్నారని విమర్శించారు.

రైతులను దోచుకున్నారు..

మొన్నటి యాసంగి కొనుగోళ్లలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. క్వింటాకు నాలుగైదు కిలోలు తరుగు పెట్టి మరీ దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రెండు నెలల పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>