కరీంనగర్‌లో ఘనంగా జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు

కలం, కరీంనగర్‌ బ్యూరో: దివంగత మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు కరీంనగర్ (Karimnagar) నగరంలో ఘనంగా జరిగాయి. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో పాటు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. దివంగత నేత, తమ రాజకీయ గురువు చొక్కారావు సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని చెప్పారు. వారు రాజకీయాల్లో పారదర్శకతకు నీతికి, నిజాయితీకి మారు పేరు అని కొనియాడారు. ఆయన్ని ఆదర్శకంగా తీసుకొని జిల్లా రాజకీయాల్లో ఎదిగామని మంత్రి వెల్లడించారు. అలాగే ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజని ప్రసాద్, ఏం.డి తాజ్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య, బోనాల శ్రీనివాస్, నిహాల్ అహ్మద్, వంగల విద్యాసాగర్, కామ్రెడ్డి రాంరెడ్డి, కిమ్ పహాద్ , మాదాసు శ్రీనివాస్, కంకణాల అనిల్ కుమార్, కుంభాల రాజు కుమార్, తోట అంజయ్య, కొట్టే ప్రభాకర్, పెద్ది గారి తిరుపతి, సాయిని తిరుపతి, షబాన మహమ్మద్, ఖలీల్, నాగుల సతీష్, ముక్క భాస్కర్, స్వప్న శ్రీ, బసవరాజ్ శంకర్, పెంట శేఖర్, రాచర్ల పద్మ, కుర్ర పోచయ్య, నెల్లి నరేష్, గుండారపు శ్రీనివాస్, వీర దేవేందర్, మార్కరాజు, బత్తిని చంద్రయ్య గౌడ్, సుంకరి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>