కలం, మునుగోడు: మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం అధ్యక్షులు గ్యార కాశయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లి మండలం లింగోటం గ్రామం (Lingotam Village)లోని నీటి శుద్ధి కేంద్రం వద్ద కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. భగీరథ కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా శ్రమిస్తున్నందున తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులకు రావాల్సిన బోనస్‌లను తక్షణమే చెల్లించాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.

