కలం, వెబ్ డెస్క్: సైజులో పెద్దగా ఉండే పనస పండు రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ నెంబర్ వన్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ పండును ఒక పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి ఇది అద్బుతంగా పనిచేస్తుందట. ఇంతకీ ఈ పనస పండు తినడం వలన మనకు కలిగే బెనిఫిట్స్ (Jackfruit Benefits) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస పండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం..
1. రోగనిరోధక శక్తి పెరుగుదల: పనస పండులో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నారు. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడతాయట.
2. మెరుగైన జీర్ణక్రియ: దీనిలోని అధిక పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. ఇది మలబద్ధకం సమస్యను నివారించడమే కాకుండా, ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుతుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
3. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: ఇందులో లభించే పొటాషియం రక్తపోటు స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలోనూ ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
4. రక్తహీనత నివారణ: పనస పండులో ఐరన్ కంటెంట్ మంచి మొత్తంలో ఉండటం వల్ల, ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్తత్తిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
5. బ్లడ్ షుగర్ నియంత్రణ: పనస పండు తియ్యగా ఉన్నప్పటికీ, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
6. ఎముకలు, కంటి ఆరోగ్యం: ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే విటమిన్ ఎ, లుటిన్ కంటి చూపును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయంటున్నారు.
7. బరువు తగ్గడానికి సహాయం: ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువ సమయం ఆకలి వేయదట. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Note: ఈ సమాచారం కేవలం పాఠకుని ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీనిని మందులకు ప్రత్యామ్నాయంగా భావించవద్దు. షుగర్ ఉన్నవాళ్లు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే ఈ పండు తీుకోవాలి.

