ఖమ్మంలో చిన్నారి అక్రమ దత్తత కలకలం

కలం, ఖమ్మం బ్యూరో: నగరంలోని (Khammam) ఖానాపురం-2 అంగన్‌వాడీ కేంద్ర పరిధిలో చిన్నారి అక్రమ దత్తత (Illegal Adoption) ఉదంతం కలకలం రేపింది. దీనిని ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం గుర్తించారు. బల్లేపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ సందర్భంగా రెండు నెలల చిన్నారిని ఓ కుటుంబం దత్తత తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

​ఈ సమాచారం అందుకున్న వెంటనే సీడీపీవో వీరభద్రమ్మ ఇతర సిబ్బంది దత్తత తీసుకున్న వారి నివాసాన్ని నేరుగా సందర్శించారు. దత్తత ప్రక్రియ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా జరగాలని వారికి సూచించారు. అనంతరం ఆ కుటుంబాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. కాగా, తిరుమలాయపాలెం మండలం కేశవపురం గ్రామం నుంచి ఈ ఆడశిశువును తాము దత్తత తీసుకున్నట్లు సదరు కుటుంబం అధికారులకు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>