కలం, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో కలిసి పని చేయడం చాలా కష్టమని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. చంద్రబాబు ఒక లక్ష్యం సాధించిన వెంటనే మరో లక్ష్యాన్ని నిర్దేశిస్తారని చెప్పారు. చంద్రబాబు తమకు ఒక్కటే నేర్పించారని, ఏదైనా సాధిస్తే కనీసం ఎంజాయ్ చేసేందుకు ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వరని పేర్కొన్నారు. ఇటీవల తమ ఇంటికి ప్రధాని మోదీ వచ్చారని, ఆయనను కలిసిన వెంటనే మళ్లీ రెండు గంటల్లో సింగపూర్ వెళ్లినట్లు తెలిపారు. సింగపూర్ మంత్రితో మీటింగ్ తర్వాత అక్కడి నుంచి నేరుగా అస్సాం వచ్చినట్లు చెప్పారు. రెండు గంటలు ఫ్లైట్ జర్నీ చేసి, మళ్లీ విజయవాడకు రెండు గంటలు ప్రయాణం చేసినట్లు తెలిపారు. ఈ నాలుగు గంటల వ్యవధిలో చంద్రబాబు తనకు 22 పాయింట్లు ఫాలో అప్ చేసేందుకు ఇచ్చారని లోకేశ్ చెప్పారు. కనీసం కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా కల్పించలేదని అన్నారు. ఇక చంద్రబాబుతోనే కొంచెం ఎంజాయ్ చేయనివ్వండి సార్, మీతో కలిసి పని చేయడం కష్టం సార్ అని చెప్పినట్లు తెలిపారు. అందరూ ఎక్కడ రిలాక్స్ అవుతారోనన్న భయంతో నిరంతరం తదుపరి కార్యచరణకు చంద్రబాబు పథకాలు రచిస్తారని చెప్పారు.

