కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా కురవి (Kuravi) మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యనికి మత్తుకు బానిసైన భర్త గుజ్జుల మధు తన నిండు గర్భిణి భార్య రమణపై తరచు కొడుతూ ఉండడం చేసేవాడు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా మద్యం సేవించి భార్యపై దాడి చేశాడు. బాధను భరించలేక మానసికంగా కుంగిపోయిన సదరు గర్భిణీ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

