మొంథా తుపాను దెబ్బకు బ్రహ్మంగారి నివాస గృహం కూలింది. మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటి వల్లే బ్రహ్మంగారి నివాసం కూలింది. దీనిపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. వెంటనే బ్రహ్మంగారి నివాస పునరుద్దరణ పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొంథా తుఫాను అనంతరం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందరికీ ఆర్థిక సహాయం అందించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దాంతో పాటుగా పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి పరిహారం, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నాం. మత్య్సకార కుటుంబాలకు, చేనేతలకు 50 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ‘‘రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, భారీ నష్టాన్ని నివారించగలిగాం’’ అని Nara Lokesh తెలిపారు.
Read Also: రోహిత్ రికార్డ్.. అగ్రస్థానం సొంతం..

