‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో చేయనున్న మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్‌కు స్థానం కల్పించనుంది. ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో ఒకటి అజారుద్దీన్(Azharuddin)కు ఇవ్వడానికి అధిష్టానం కూడా ఓకే చెప్పింది’ అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)లో అజారుద్దీన్‌ను పక్కనబెట్టి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంతో ముస్లిం ఓటర్ల నుంచి వ్యతిరేకత వస్తోందని, దానిని నుంచి రక్షణ కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
అయితే అజారుద్దీన్(Azharuddin) ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కాకపోవడంతో మంత్రి పదవి దక్కదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్‌ను ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించింది. దానికి ఆమోదం లభిస్తే అజారుద్దీన్‌కు మంత్రి పదవి రావడానికి మార్గం కాస్తంత సుగమం అయినట్లే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ‘మొంథా’ తుపానుపై సీఎం రేవంత్ ఆరా..

