epaper
Wednesday, February 18, 2026
epaper

ఢిల్లీలో లోకేష్‌ పర్యటన.. చార్లీ ఫాక్స్‌ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ పర్యటనలో భాగంగా చార్లీ ఫాక్స్‌ట్రాట్ ఏవియేషన్(Charlie Foxtrot Aviation) సర్వీసెస్ సంస్థను ప్రారంభించారు. అట్లాంటా పర్యటన సందర్భంగా వచ్చిన  ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చి భారత ఏవియేషన్ రంగానికి కొత్త దిశను చూపనుందని లోకేశ్ పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగానికి ప్రపంచ స్థాయి నైపుణ్యంతో కూడిన ప్రతిభను అందించడమే దీని లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా యువ పైలట్ కేడెట్లతో లోకేశ్ (Nara Lokesh) నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నోత్తర కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం భారత ఏవియేషన్ రంగ భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచింది. యువతలో ఉన్న ఉత్సాహం, ప్రతిభ దేశ విమానయాన రంగాన్ని మరో  స్థాయికి తీసుకెళ్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇలాంటి శిక్షణా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని లోకేశ్ ట్వీట్ చేశారు.

Read Also: అల్లూరి జిల్లాలో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>