కలం, డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎడమ చేతికి సపోర్ట్ బెల్ట్ ను చూసి ఫ్యాన్స్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. చిరంజీవికి ఏమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో.. తాజాగా మెగాస్టార్ స్పందించారు. ఈ మేరకు ప్రత్యేక ట్వీట్ చేశారు. ‘చాలా మంది సన్నిహితులు నా చేతికి బెల్ట్ చూసి ఏమైందని ఆరా తీశారు. నా భుజానికి మైనర్ కీ హోల్ సర్జరీ జరిగింది. ఆల్రెడీ కోలుకుంటున్నాను. నా రొటీన్ లైఫ్ కు వచ్చేశాను. ఈ సందర్భంగా డాక్టర్ నితిన్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఆయన ప్రముఖ ఆంథ్రోస్కోపీ సర్జన్. ఆయన కేరింగ్, స్మూత్ ట్రీట్ మెంట్ వల్ల త్వరగా కోలుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
మెగాస్టార్ నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అటు విశ్వంభర మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది. దీంతో తన తర్వాత సినిమా ప్రాజెక్టుపై మెగాస్టార్ దృష్టి పెట్టారు. శ్రీకాంత్ ఓదెల మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు చిరు (Chiranjeevi). ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత కొత్త సినిమాపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: వారణాసి : మహా శివ భక్తునిగా ప్రకాష్ రాజ్..
Follow Us On: Sharechat


