జాబ్ క్యాలెండర్‌లోనే టీచర్ పోస్టులు : లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసెంబ్లీ వేదికగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ (Job Calendar) రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో టీచర్ పోస్టులు (Teacher Posts) కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే గత ఏడాది 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు లోకేశ్ గుర్తు చేశారు. త్వరలో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుండటంతో వర్టికల్, హారిజెంటల్ రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉందని.. జోనల్ రీనోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని తెలిపారు. దీని కోసం అన్నీ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ లు కలిసి పని చేస్తున్నాయని లోకేశ్(Nara Lokesh) తెలిపారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కానుండటంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>