Mobile Popup Ad
Mobile Popup Ad

అలర్ట్.. ఇరాన్‌లోని భారతీయులకు కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు, టూరిస్టులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు భారత (India)  విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఆ దేశంలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. నిరసనలు లేదా ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. వీలైనంత త్వరగా ఇరాన్ దేశాన్ని విడివేరుగా వెళ్లాలని కేంద్ర విదేశాంగశాఖ కోరింది. ‘ఇరాన్‌లోని భారతీయ పౌరులు తమ పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డులు వంటి ప్రయాణ డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ అధికారులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితులు తలెత్తితే +989128109115; +989128109109; +989128109102; +989932179359 నంబర్లలో కాంటాక్ట్ అవ్వాలి. cons.tehran@mea.gov.in, mailto:cons.tehran@mea.gov.in ఈ మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచన ఉంది. ఇరాన్‌లో ఉంటూ రిజిస్టర్ కాని భారతీయులు https www.meaers.com/request/home, https://www.meaers.com/request/home) లింక్ ద్వారా తక్షణం నమోదు చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇంటర్నెట్ సమస్యల వల్ల రిజిస్ట్రేయన్ చేయలేకపోతే, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>