ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి వ్యాఖ్యలపై నందిపేట్ లో నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో : బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేట్ లో పినాయిల్ బాటిల్స్ తో నిరసన తెలిపారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన మహనీయురాలు ఇందిరా గాంధీ పేరును ఇప్ప సారాకు పెట్టకండి అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. అన్ని పథకాలకు ఇందిరా గాంధీ పేరు ఉందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆమె చేసిన కృషి, త్యాగం వల్లే దేశం అభివృద్ధి చెందిందని కొనియాడారు.

బీజేపీ నాయకుడు వాజ్​ పేయి.. ఇందిరా గాంధీని ఉక్కు మహిళ, దుర్గా దేవి అని పిలిచారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే నోరు కడగటానికి కాంగ్రెస్ నాయకులు పినాయిల్ బాటిల్స్ తో నిరసన తెలిపారని అన్నారు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇసుబ్, దమ్మాయి శ్రీను, దూడ వెంకటేష్, సర్పంచ్ సంతోష్ గౌడ్, ప్రభుదాసు, కాంతం చిన్నయ్య, తిమ్ముల పోశెట్టి, వెల్మల్ ప్రభుదాస్, కొమిరె ముత్తెన్న, ఓంకార్, కాజవాలి, తోట మహేష్, తుక్కన్న, గాదె శ్రీను, కొండూరు సంజీవ్, ఎర్రోళ్ల రవి, మేరా శ్రీనివాస్, ఫిరోజ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్డిగారి నిఖిల్, హరీష్, సాయి, మన్నె సాగర్, తమ్మల్లా దేవేందర్, నర్సయ్య, తిమ్ముల శివ, ద్యావతి లింగం, మేకల గంగారెడ్డి, అరె రాజన్న, చింతకుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ప్రభుత్వం చేతికి మెట్రో రైల్.. అసెంబ్లీలో సీఎం ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>