కలం, వెబ్‌డెస్క్: బెంగాల్ ఎన్నికలకు ముందు టీఎంసీకి, మమతా బెనర్జీ (Mamata Banerjee) కి షాక్. నందిగ్రామ్‌లోని సహకార వ్యవసాయ అభివృద్ధి సంఘాల(సీఏడీసీ) ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ గెలుపొందింది. మొత్తం తొమ్మిది స్థానాలుండగా అన్నింటినీ కాషాయ పార్టీ కైవసం చేసుకొని స్వీప్ చేసింది. గెలుపు అనంతరం బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో సంబరాలు జరుపుకొన్నారు. రాష్ట్ర శాసనసభకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండా ప్రస్తుతం వచ్చిన ఫలితం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కాగా, రాబోయే ఎన్నికల్లో బీజేపీని షేక్ చేస్తానని చెప్పిన మమతకు, నందిగ్రామ్ షాక్ ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ అన్నారు.
గత ఎన్నికల్లో సువేందు చేతిలో ఓడినప్పటికీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న మమతను ‘కంపార్ట్మెంటల్ సీఎం’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇలా దొడ్డిదారిన సీఎం కావడం బెంగాల్‌కు అవమానకరమని విమర్శించారు. సినిమా డైలాగుల లాంటి మాటలు చెప్పడం తప్ప, పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి మమత చేసిందేమీ లేదని ప్రజలకు అర్థమైందన్నారు.
కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ (Mamata Banerjee) .. ఒకప్పటి తన సహచరుడు, బీజేపీ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం భవానీపూర్‌లో గెలిచిన టీఎంసీ అభ్యర్థితో రాజీనామా చేయించి, ఆ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు.
Read Also: ఏరోనాటిక్స్ సదస్సు ప్రారంభం: తేజస్ రూపశిల్పులకు సన్మానం
Follow Us On: Pinterest


