కలం, వెబ్ డెస్క్ : ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లవ్ జిహాద్ అనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు సవాల్ విసిరారు. ఒకవేళ దేశంలో లవ్ జిహాద్ అనేది నిజంగా జరుగుతుంటే, దానికి సంబంధించిన గణాంకాలను పార్లమెంటులో ఎందుకు ప్రదర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి లవ్ జిహాద్‌కు సంబంధించిన పూర్తి రికార్డులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటో ముందుగా నిర్వచించాలని ఒవైసీ కోరారు. ఇద్దరు వ్యక్తులు మేజర్లు అయి ఉండి, తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇతరుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని యువతకు ప్రస్తుతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎంతో అవసరమని, కానీ ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. యువత భవిష్యత్తును వదిలేసి ఇలాంటి వివాదాస్పద అంశాల వైపు వారిని మళ్లించడం సరికాదని ఒవైసీ (Owaisi) పేర్కొన్నారు.

Read Also: దీదీకి షాక్.. నందిగ్రామ్‌లో బీజేపీ స్వీప్
Follow Us On : WhatsApp


