కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో (Krishna District) దారుణం జరిగింది. కృష్ణా నియోజకవర్గంలో 40 రోజుల పసిబిడ్డను తల్లి చంపేసింది. 2 రోజుల క్రితం జరిగిన పసిపాప హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాప తల్లే చంపినట్టు తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న రావి సాయిచైతన్యకు 40 రోజుల పాప ఉంది. అయితే పుట్టినప్పటి నుంచి పాపకు అనారోగ్య సమస్యలు వస్తుండటంతో ట్రీట్ మెంట్ కు బాగానే ఖర్చు పెడుతున్నారు. పాప వైద్య ఖర్చలు ఎక్కువ అవుతున్నాయని అత్త రావి వాణి రోజూ సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టింది. సాయిచైతన్య భరించలేక చివరకు పాపనే చంపేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. దీంతో పాప మృతికి కారణమైన తల్లి, నానమ్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Read Also: పెండ్లి వేడుకల్లో విషాదం.. సర్పంచ్‌ను కాల్చి చంపిన దుండగులు
Follow Us On: Instagram


