నమీబియా టీ20 జట్టు రెడీ.. వాన్ లింగెన్ రీఎంట్రీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో జరిగే టీ20 ట్రై-సిరీస్‌కు నమీబియా జట్టు (Namibia T20I Squad) సిద్ధమైంది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గెర్హార్డ్ ఎరాస్మస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో మైఖేల్ వాన్ లింగెన్‌కు చోటు దక్కడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2024 తర్వాత అతడు టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. అనుభవజ్ఞులైన రూబెన్ ట్రంపెల్‌మన్, జాన్ ఫ్రైలింక్, జేజే స్మిత్, బెర్నార్డ్ షోల్ట్జ్ కూడా జట్టులో ఉన్నారు.

విండ్‌హోక్‌లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రై-సిరీస్ జరగనుంది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 6న ఫైనల్ జరుగుతుంది. ఈ సిరీస్ తర్వాత నమీబియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్‌లు విండ్‌హోక్‌లోనే జరుగుతాయి. 2027 క్రికెట్ ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సహ ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి. అందుకే ఈ మూడు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యం ఉంది.

నమీబియా జట్టు:

గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), మైఖేల్ వాన్ లింగెన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ షోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రూగర్, జాక్ బ్రాసెల్, మ్యాక్స్ హెయింగో, అలెక్స్ వోల్షెంక్, జూనియర్ తాయాండా, నికోల్ లోఫ్టీ-ఈటన్, జేసీ బాల్ట్, వాల్డో స్మిత్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>