కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారంవారిగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన బైక్, లారీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నారంవారిగూడెం సమీపంలోని రాము కోళ్ల ఫారం పక్కన నర్సరీ వద్ద ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి పూర్తి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

