Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖలో పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు (ఎస్ఐ) స్థాన చలనం కలిగింది. ప్రజా ప్రయోజనాలు, పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా జిల్లాలోని పలువురు సివిల్ ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ సోమవారం తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-5 యాదాద్రి పరిధిలోకి వచ్చే ఈ బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.

దేవరకొండ (Devarakonda) ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె.సతీష్‌ను విజయపురి టౌన్ పీఎస్‌కు బదిలీ చేశారు. విజయపురి టౌన్ ఎస్ఐ జి.ముత్తయ్యను నల్లగొండ వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నల్లగొండ-1 టౌన్ ఎస్ఐ జె.గోపాల్ రావును పెద్దవూర పీఎస్ ఎస్ఐగా నియమించారు. పెద్దవూర ఎస్ఐగా ఉన్న వై.ప్రసాద్‌ను వీఆర్‌కు పంపించారు.

ఇప్పటివరకు వీఆర్‌లో ఉన్న డీ విజయ్ కుమార్‌కు నిడమనూరు పీఎస్ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత నిడమనూరు ఎస్ఐ యు సురేష్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. మిర్యాలగూడ-2 టౌన్ ఎస్ఐ బీ రాంబాబును మర్రిగూడ పీఎస్‌కు బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ ఎం కృష్ణారెడ్డిని నల్లగొండ వీఆర్‌కు అటాచ్ చేశారు. బదిలీల ఉత్తర్వులు పొందిన ఎస్ఐలందరూ తమ ప్రస్తుత స్థానాల నుండి తక్షణమే రిలీవ్ అయి, కేటాయించిన నూతన పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించి నివేదించాల్సిందిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు.

Read Also: ముంబై, అహ్మదాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>