జనగణనలో ఆలస్యం సహించం.. తహశీల్దార్లకు కలెక్టర్ హెచ్చరిక!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణిలో అర్జీదారుల నుండి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ (Prajavani) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజావాణిలో గృహ నిర్మాణం, విద్యుత్, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమ శాఖ, భూసర్వే రికార్డులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మిషన్ భగీరథ, జిల్లా మైనారిటీ సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, మైనింగ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, విద్య, వైద్యం, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 122 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు.

సెన్సస్ పై తహశీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష

ప్రజావాణి (Prajavani) అనంతరం జిల్లాలో జనగణన నిర్వహణకు సంబంధించి మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వెబెక్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా మండలాల్లో ఇంకా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ (“హెచ్‌ఎల్‌బిబి”)లు ఎందుకు ప్రారంభించలేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా హన్వాడ, కోయిలకొండ, జడ్చర్ల మండలాల్లో “హెచ్‌‌ఎల్‌‌బిబి” (HLBB)లు ఇంకా ప్రారంభం కాలేదని, చాలా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణనకు సంబంధించిన “హెచ్‌ఎల్‌బిబి”లను వెంటనే ప్రారంభించాలని ఆమె ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఈ రోజే అన్ని మండలాల తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి “హెచ్‌ఎల్‌బిబి” లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఎన్యూమరేటర్లు “హెచ్‌ఎల్‌బిబి” ఎందుకు ప్రారంభించలేదో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని, సాయంత్రంలోపు మండలాల వారీగా ఎన్ని “హెచ్‌ఎల్‌బిబి” ప్రారంభించారో, ఎన్ని పూర్తి చేశారో, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో వివరాలతో నివేదిక సమర్పించాలని తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రెడ్ క్రాస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం కోసం నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను సూచించారు.

అనంతరం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN), ధరతి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలను మే 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, డీఆర్ఓ రామ్ రెడ్డి, జెడ్పీసీఈఓ, ఇంచార్జి డీపీఓ వెంకట్ రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>